ఎక్కువ మంది పిల్లలను కనండి
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:58 AM
అమెరికాలోని క్రైస్తవులంతా మరింత మంది పిల్లలను కనాలని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ మాజీ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పిలుపునిచ్చారు.
వాషింగ్టన్, నవంబరు 21: అమెరికాలోని క్రైస్తవులంతా మరింత మంది పిల్లలను కనాలని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ మాజీ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పిలుపునిచ్చారు. 2035 నాటికి ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అధిగమించి ఇస్లాం అతిపెద్ద మతంగా అవతరిస్తుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల తన నివేదికలో అంచనా వేసిన నేపథ్యంలో ఆమె శుక్రవారం (స్థానిక కాలమానం) ఈ మేరకు ఎక్స్ వేదికగా క్రైస్తవులకు పిలుపునిచ్చారు. ప్యూ నివేదికను షేర్ చేసిన ఆమె.. ‘వివాహాలు చేసుకోండి.. ఎక్కువ మంది పిల్లలను కనండి. వారిని చర్చి సన్నిధిలో పెంచండి. అమెరికాను ప్రేమించాలని పిల్లలకు బోధించండి’ అని రాశారు. క్రైస్తవ మహిళలతో పోల్చితే ముస్లి మహిళలు ఎక్కువమంది సంతానికి జన్మనిస్తున్నారని.. అందువల్లే ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందని ప్యూ రీసెర్చ్ తెలిపింది.