ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్య కాదు..హత్య
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:46 AM
అమెరికాకు చెందిన ప్రముఖ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురై ఉండొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు మైఖేల్ ఫ్రీమన్ సంచలన ఆరోపణలు చేశారు
అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన ఆరోపణలు
లండన్, నవంబరు 17: అమెరికాకు చెందిన ప్రముఖ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురై ఉండొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు మైఖేల్ ఫ్రీమన్ సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఆగస్ట్ 10న న్యూయార్క్‌లోని జైలులో ఎప్‌స్టీన్ మృతి చెందగా, ఆత్మహత్యగా జైలు అధికారులు ప్రకటించారు. అయితే, నాటి పోస్టుమార్టం నివేదిక, ఫొటోలను ఫ్రీమన్ తాజాగా విశ్లేషించి.. ఎప్‌స్టీన్ మెడ భాగంలో ఉరి గుర్తుకు పైన గోళ్లతో గీరిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. వెనుక నుంచి మెడకు తాడు బిగించినప్పుడు బాధితుడు దాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి గుర్తులు ఏర్పడతాయన్నారు. ఆయన ముఖంపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా