Share News

నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడి... ఇరాన్ ఐఆర్‌జీసీ వెల్లడి

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:38 PM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా టార్గెట్ చేసిందని ప్రకటించింది.

నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడి... ఇరాన్ ఐఆర్‌జీసీ వెల్లడి
Benjamin Netanyahu

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో నెతన్యాహు తమ కార్యాలయంలో ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియలేదు.


'క్రిమినల్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, ఎయిర్ ఫోర్స్ కమాండర్ కార్యాలయాన్ని ఖైబర్ షెకాన్ బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా ఢీకొట్టింది' అని ఆర్‌ఆర్‌జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇరాన్ ప్రకటనను ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు.


అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మరణించడంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఇరాన్ ఆదివారం జరిపిన క్షిపణి దాడుల్లో జెరూసలేం సమీపంలోని బీట్ షెమేష్‌‌లో 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ అంతే వేగంగా స్పందించింది. ఇరాన్ ప్రతిదాడులకు దిగితే మునుపెన్నడూ ఎరుగని రీతిలో భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో 550 మందికి పైగా మృతి

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

Updated Date - Mar 02 , 2026 | 04:56 PM