Share News

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఐదుగురు పాలస్తీనియన్ల మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:07 PM

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో మహిళ మరణించింది.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఐదుగురు పాలస్తీనియన్ల మృతి
Israeli Strikes Kill 5 Palestinians in Gaza, Health Officials Say

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 30: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో మహిళ మరణించింది. గాజా‌‌పై ఇజ్రాయెల్ జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


గాజా సిటీలోని 'తెల్ అల్-హవా' (Tel Al-Hawa) పరిసరా ప్రాంతంలో ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. అలాగే మరొక ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో ఒక మహిళ మరణించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం తక్షణమే ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


గత అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హమాస్ సైనిక సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకుంటూ దాడులకు దిగుతోందని, అందుకే చర్యలు తీవ్రతరం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది.


అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం, ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పునరుద్ధరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా గాజాలో జరిగిన దాడుల్లో సుమారు 1,400 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు, నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ తెలిపాయి.


అక్టోబర్ 2023లో హమాస్ జరిపిన దాడి (1,200 మంది మృతి) తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో ఇప్పటివరకు మొత్తం 74,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Sep 30 , 2026 | 05:14 PM