Share News

హమాస్ మళ్లీ దాడులు చేయవచ్చు.. అక్టోబర్ 7 వార్షికోత్సవం వేళ ఇజ్రాయెల్ హై అలర్ట్..

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:45 PM

అక్టోబర్ 7 వార్షికోత్సవం సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు, ఉగ్ర చర్యలకు హమాస్ ప్రయత్నించే అవకాశం ఉందన్న సమాచారాన్ని నిఘా వర్గాలు అందించాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.

హమాస్ మళ్లీ దాడులు చేయవచ్చు.. అక్టోబర్ 7 వార్షికోత్సవం వేళ ఇజ్రాయెల్ హై అలర్ట్..
Israel military alert

ఇంటర్నెట్ డెస్క్: హమాస్ మళ్లీ దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని హై అలర్ట్‌లో ఉంచింది. అక్టోబర్ 7 వార్షికోత్సవం సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు, ఉగ్ర చర్యలకు హమాస్ ప్రయత్నించే అవకాశం ఉందన్న సమాచారాన్ని నిఘా వర్గాలు అందించాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు (Israel military alert).


అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 1,200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఈ దాడులు జరిగి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా హమాస్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో గాజాలో సైన్యం అప్రమత్తంగా ఉండాలని కాట్జ్ సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని, వచ్చే ప్రతి హెచ్చరికను తీవ్రంగా పరిగణించి ముప్పును అడ్డుకోవాలని కాట్జ్ ఆదేశించారు (Hamas attacks, October 7 anniversary).


ఇజ్రాయెల్ సైనికులకు నష్టం జరిగితే హమాస్‌తో పాటు గాజా ప్రజలు కూడా తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు (Israel Gaza conflict). కాగా, ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య 2025 అక్టోబర్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ గాజాలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..


మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 06:48 PM