Share News

హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు..

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:45 PM

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఆన్ పీస్ అనే వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఒమన్ తీరానికి సమీపంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

హోర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు..
Missile attack on vessel

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ ఆన్ పీస్ అనే వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఒమన్ తీరానికి సమీపంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 12 మంది సిబ్బంది గాయపడగా.. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు (Missile attack on MT On Peace).


భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎంటీ ఆన్ పీస్ నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులు. నౌకను గుర్తుతెలియని క్షిపణి తాకడంతో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. గాయపడిన సిబ్బందిని ఒమన్ అధికారుల సహకారంతో నౌక నుంచి తరలించారు. వారిని ఒమన్‌లోని ఖసాబ్ ప్రాంతంలో వైద్య చికిత్స కోసం చేర్చారు (Indian crew injured).


వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది (Hormuz attack). ఈ ప్రాంతంలో నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని భారత్ కోరింది. అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించింది. కాగా, ఈ దాడికి బాధ్యులు ఎవరనే విషయంపై ఇప్పటివరకు సమాచారం లేదు.


ఇవి కూడా చదవండి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..


మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 05:57 PM