Share News

హమాస్‌ మిలిటరీ అధినేత హతం

ABN , Publish Date - May 28 , 2026 | 05:36 AM

హమాస్‌ మిలిటరీ విభాగం నూతన అధినేత మొహమ్మద్‌ ఓదె్‌హను చంపివేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) ప్రకటించింది. మఽధ్య గాజాలోని రహస్య ప్రాంతంలో నక్కిన...

హమాస్‌ మిలిటరీ అధినేత హతం

  • ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో మరణించిన మొహమ్మద్‌ ఓదెహ్‌

  • బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే మృతి

  • లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు పెంచిన ఇజ్రాయెల్‌

జెరూసలేం, మే 27: హమాస్‌ మిలిటరీ విభాగం నూతన అధినేత మొహమ్మద్‌ ఓదె్‌హను చంపివేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) ప్రకటించింది. మఽధ్య గాజాలోని రహస్య ప్రాంతంలో నక్కిన అతడిని వైమానిక దాడి చేసి హతమార్చినట్లు బుధవారం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ కూడా ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఐడీఎ్‌ఫను, ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రతా ఏజెన్సీని అభినందించారు. ఓదె్‌హకు ముందు హమాస్‌ మిలిటరీ విభాగానికి అధిపతిగా కొనసాగిన ఇజాజ్‌ అల్‌ దిన్‌ అల్‌ హద్దాద్‌ను ఇజ్రాయెల్‌ రెండు వారాల క్రితమే వైమానిక దాడిలో మట్టుబెట్టింది. అతడి మరణంతో ఓదెహ్‌ ఆ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించి రెండు వారాలు గడవకముందే అతడిని కూడా ఇజ్రాయెల్‌ సైన్యం చంపివేసింది. ఓదెహ్‌ కదలికలను చాలాకాలంగా గమనిస్తున్నట్లు ఐడీఎఫ్‌ తన ప్రకటనలో పేర్కొంది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన భీకర దాడి సూత్రధారుల్లో ఓదెహ్‌ కూడా ఒకరని పేర్కొంది. అక్టోబర్‌ 7 దాడి బాఽధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని.. అతి త్యరలో లేదా కొంతకాలం తర్వాతైనా వారిని చేరుకుంటామని స్పష్టంచేసింది. ఓదెహ్‌ మృతిని హమాస్‌ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, ఇజ్రాయెల్‌ దాడిలో నలుగురు పాలస్తీనా పౌరులు మరణించినట్లు పాలస్తీనా మీడియా సంస్థ వఫా న్యూస్‌ వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రతరం చేసింది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో 30 మంది మరణించారని, మరో 40 మంది గాయపడ్డారని లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:36 AM