జుట్టు అమ్ముకుంటున్నారు.. బట్టలు, ల్యాప్‌టాప్‌లు అద్దెకిస్తున్నారు.. ఇరాన్‌లో దారుణ పరిస్థితులు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:11 PM
అమెరికాతో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించింది. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ రోజులను నెట్టుకొస్తున్నారు.
అమెరికాతో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించింది. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ రోజులను నెట్టుకొస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ఆదాయాలు తగ్గడంతో అక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం తమ వద్ద ఉన్న వస్తువులను అమ్ముకోవడం లేదా అద్దెకివ్వడం ప్రారంభించారు (Iran Economy).
జుట్టు, దుస్తులు, చెప్పులు, పర్‌ఫ్యూమ్ బాటిళ్లను విక్రయించడంతో పాటు ల్యాప్‌టాప్‌లను అద్దెకిస్తూ అదనపు ఆదాయం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ఐఎల్‌ఎన్‌ఏ (ILNA) ఈ పరిస్థితిని 'సర్వైవల్ ఎకానమీ'గా అభివర్ణించింది. ఇరాన్‌లోని ఆన్‌లైన్ క్లాసిఫైడ్ వెబ్‌సైట్లలో వాడిన వస్తువుల విక్రయ ప్రకటనలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మహిళలు తమ సహజ జుట్టును హెయిర్ ఎక్స్‌టెన్షన్ల కోసం విక్రయిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉపయోగంలో లేని చిన్నచిన్న వస్తువులను కూడా అమ్మకానికి పెడుతున్నారు (Iran Inflation Survival Economy).
చాలామంది తమ ల్యాప్‌టాప్‌లను కార్యాలయ పనులు లేదా ఆన్‌లైన్ తరగతుల కోసం రోజువారీ లేదా వారాల వారీగా అద్దెకిస్తున్నారు (Iranian Families). ఇరాన్‌లో ఆహార పదార్థాలు, మందులు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సాధారణ కుటుంబాల జీవనం భారంగా మారింది. చాలామంది వైద్య చికిత్సలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. జులై చివరలో ఇరాన్ వార్షిక ద్రవ్యోల్బణం 66 శాతానికి ఎగబాకింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..