Share News

అమెరికా మళ్లీ దాడి చేస్తే, హిందూ మహాసముద్రానికీ యుద్ధాన్ని విస్తరిస్తాం..

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:48 PM

అమెరికా మళ్లీ దాడికి దిగితే, ఈ ఘర్షణ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రం, ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుందని ఇరాన్ హెచ్చరించింది.

అమెరికా మళ్లీ దాడి చేస్తే, హిందూ మహాసముద్రానికీ యుద్ధాన్ని విస్తరిస్తాం..
Iran US Tensions: Khamenei Adviser Warns War Could Reach Indian Ocean

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 24: అమెరికా-ఇరాన్ మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. ఒకవేళ వాషింగ్టన్ గనుక ఇరాన్‌పై మళ్లీ దాడికి దిగితే, ఈ ఘర్షణ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా హిందూ మహాసముద్రంతోపాటు, ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీమ్ లీడర్ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.


ఇప్పటికే పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి నుంచి పోరు ఎర్రసముద్రం వరకు విస్తరించిందని సఫావి తెలిపారు. అమెరికా మరోసారి దాడులకు ఒడిగడితే, సమాధానంగా తమ ప్రతిదాడి హిందూ మహాసముద్రంతో పాటు ఇతర ప్రాంతాలకూ దారితీస్తుందని స్పష్టం చేశారు.

ఒకవేళ హిందూ మహాసముద్ర ప్రాంతానికి యుద్ధం పాకితే.. ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణా నిలిచిపోవడం, చమురు ఆకాశాన్నంటడం, ఈ ప్రాంత దేశాలపై తీవ్ర భద్రతా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో ఐదో వంతు జరిగే 'హోర్ముజ్ జలసంధి'ని ఇరాన్ ఇప్పటికే మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఒకవైపు ఐక్యరాజ్యసమితి సమావేశాల వద్ద ఇరు దేశాల ప్రతినిధులు మొదటిసారి ముఖాముఖి భేటీ కావడం, ఖతార్ మధ్యవర్తిత్వంలో చర్చలు పురోగతి సాధిస్తున్నాయని సంకేతాలు ఉన్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ యుద్ధ వ్యాప్తి ప్రకటనలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

Updated Date - Sep 24 , 2026 | 08:21 PM