Share News

ఇరాన్ సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీకి తీవ్ర అస్వస్థత!

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:24 PM

ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇరాన్ సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీకి తీవ్ర అస్వస్థత!
Israeli Media Claims Iran's Supreme Leader Mojtaba Khamenei Is Critical

టెల్ అవీవ్ (ఇజ్రాయెల్), ఆగస్టు 7: ఇరాన్ సర్వోన్నత నేత, సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ కథనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.


ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 14, జెరూసలేం పోస్ట్, ఇరాన్‌వైర్ ఔట్‌లెట్ తెలిపిన వివరాల ప్రకారం, ఖమేనీ 'అత్యంత విషమ పరిస్థితిలో' ఉన్నారనే వదంతులు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయని పేర్కొన్నాయి.


జెరూసలేం పోస్ట్ మరో అడుగు ముందుకేసి 'ఆయన అమరత్వం పొందారంటూ త్వరలోనే వార్త వస్తే మేము ఆశ్చర్యపోము' అని పేర్కొంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల ఒక ప్రభుత్వ టీవీ ఇంటర్వ్యూలో ఖమేనీతో ప్రత్యక్ష సంభాషణ ప్రస్తుతం 'చాలా కష్టం' అని అంగీకరించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.


కాగా, 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి మరణించిన కొద్దికాలానికే ఖమేనీ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. కేవలం లిఖితపూర్వక ప్రకటనలే విడుదల చేశారు. అవే దాడుల్లో మొజ్తబా ఖమేని కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి

గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..

ఆసుపత్రి భవనం పెచ్చులూడి మహిళకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

Updated Date - Aug 07 , 2026 | 08:25 PM