గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..
ABN , Publish Date - Aug 07 , 2026 | 10:41 AM
గుజరాత్‌లోని ఓ గ్రామంలో బావి మిస్టరీ ప్రజలను భయపెడుతోంది. బావిలోని నీళ్లు అటు, ఇటు వేగంగా కదులుతుండటంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఏదో వినాశనం జరగబోతోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: గుజరాత్‌లోని ఓ గ్రామంలో బావి మిస్టరీ ప్రజలను భయపెడుతోంది. బావిలోని నీళ్లు అటు, ఇటు వేగంగా కదులుతుండటంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఏదో వినాశనం జరగబోతోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు... మోర్బీ తాలూకాలోని విర్‌పార్ధా గ్రామంలో ఓ బావి ఉంది. రెండు రోజుల క్రితం ఆ బావిలోని నీళ్లు అటు, ఇటు అత్యంత వేగంగా కదలసాగాయి. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. పెద్ద సంఖ్యలో జనం బావి దగ్గర గుమిగూడారు.
కొన్ని గంటల తర్వాత నీళ్లు కదలటం ఆగిపోయింది. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బావిలోని నీళ్లు మళ్లీ కదలటం మొదలైంది. వారంలో రెండో సారి ఇలా జరగటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ గ్రామం తరచుగా భూకంపాలు వచ్చే ఏరియాలో ఉండటంతో.. ఏదో వినాశనం జరుగుతుందని జనం భయపడుతున్నారు. అయితే, ఆ బావిలోని నీళ్లు అలా కదలడానికి గల సరైన కారణాలు తెలియరాలేదు. అధికారులు కూడా ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ గ్రామంలో త్వరలో భూకంపం రాబోతోంది. గ్రామస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి’..‘నీళ్లేంటి అలా కదులుతున్నాయి. చాలా వింతగా ఉంది’..‘జనం ఇకపై ఆ బావి దగ్గరకు వెళ్లాలంటే భయపడతారు’..‘అది భూకంపం వస్తుందని చెప్పడానికి సంకేతం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం.. ముహూర్తం ఫిక్స్