ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి
ABN , Publish Date - Aug 16 , 2026 | 06:12 AM
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై...
రిక్టర్‌స్కేల్‌పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత
విరిగిపడ్డ కొండచరియలు.. వందల ఇళ్లు ధ్వంసం.. పలువురికి గాయాలు
2000 మంది శిబిరాలకు తరలింపు
వరుస ప్రకంపనాల తర్వాత మరో భూకంపం
మౌమెరి(ఇండోనేషియా), ఆగస్టు 15: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపంతో కారణంగా 47 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 2 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భూకంపంతో కొండ చరియలు విరిగి పడడం, రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. తీవ్రమైన భూప్రకంపనల కారణంగా అధికారులు తొలుత సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తర్వాత ఉపసంహరించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం 4.24 గంటలకు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత గల మరో భూకంపం కూడా సంభవించింది. భూ ఉపరితలం నుంచి 172.5 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించడంతో పెద్దగా నష్టం వాటిల్ల లేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. కాగా ఇండోనేషియాలో 1992లో భూకంపం కారణంగా వచ్చిన సునామీతో ఫ్లోరెస్ ద్వీపం వద్ద 2,500 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News