Share News

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:16 PM

వివాహం బంధంలోకి ఎంతో సంతోషంగా అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ యువ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన భారత సంతతి కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయాయి.

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..
US Helicopter Crash

వివాహం బంధంలోకి ఎంతో సంతోషంగా అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ యువ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన భారత సంతతి కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది (Indian-Origin Pilot death).


కేరళలోని ఎర్నాకుళంకు చెందిన డేవ్ ఫిజీ కుటుంబం కొన్నేళ్ల క్రితం అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడింది. డేవ్ ఫిజీ (25) అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పని చేస్తున్నారు. డేవ్ ఫిజీకి కేరళ మూలాలున్న జెస్నితో వివాహం నిశ్చయమైంది. మే 29వ తేదీన జార్జియాలోని డాసన్ విలే ప్రాంతంలో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపాయి. వివాహ వేడుకల అనంతరం వధూవరులు రాత్రి పది గంటల సమయంలో డాసన్ విలే నుంచి అట్లాంటాకు హెలికాప్టర్‌లో బయల్దేరారు (US Helicopter Crash).


ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది (Newlywed Pilot Dies). ఈ ఘటనలో పైలట్‌తో పాటు డేవ్ కూడా చనిపోయారు. అయితే తీవ్ర గాయాలపాలైన వధువు జెస్ని ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆమెను సహాయక బృందాలు రక్షించి హాస్పిటల్‌కు తరలించాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదిక 30 రోజుల్లో వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 12:16 PM