Share News

ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న అనిల్‌ మేనన్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:54 AM

రష్యాకు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌-29 రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎ్‌సఎ్‌స)కి బయలుదేరిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌, మరో ఇద్దరు...

ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న అనిల్‌ మేనన్‌

వాషింగ్టన్‌, జూలై 15: రష్యాకు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌-29 రాకెట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎ్‌సఎ్‌స)కి బయలుదేరిన భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌, మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములు బుధవారం తెల్లవారు జామున అందులోకి చేరుకున్నారు. కజకిస్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.17 గంటలకు వీరి రాకెట్‌ బయలుదేరిన సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సరిగ్గా ఆ పై నుంచే గమనం సాగించింది. కాగా వీరి రాకెట్‌ 8 నిమిషాలపాటు పయనించి ప్రాథమిక కక్ష్యలోకి చేరుకుంది. అనంతరం మూడు గంటల పాటు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరుకుంది. సరిగ్గా మంగళవారం రాత్రి 11.52 గంటలకు దాంతో అనుసంధానం అయ్యింది. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు అనిల్‌ మేనన్‌ మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 05:54 AM