నువ్వు ముస్లింవా.. అని అడిగి మరీ అమెరికాలో భారతీయుడిపై కత్తితో దాడి
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:56 AM
అమెరికాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా యూటా రాష్ట్రంలో ఒక భారతీయ ముస్లింపై మత విద్వేషంతో అత్యంత క్రూరమైన దాడి...
వాషింగ్టన్, జూలై 15: అమెరికాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా యూటా రాష్ట్రంలో ఒక భారతీయ ముస్లింపై మత విద్వేషంతో అత్యంత క్రూరమైన దాడి జరిగింది. ‘‘నువ్వు ముస్లింవా?’’ అని అడిగి మరీ దుండగుడు అతడిపై కత్తితో ఏకంగా 15 సార్లు దాడికి తెగబడ్డాడు. భారత్‌కు చెందిన సయ్యద్ సొహైల్(37) యూటా రాష్ట్రంలోని వ్యాలీఫేర్ మాల్‌లో ఓ షాపులో పనిచేస్తున్నాడు. రోజూలాగే అతడు విధుల్లో ఉండగా..మైఖేల్ లార్సెన్(48) అనే వ్యక్తి అతడి వద్దకు వచ్చాడు. మొదట సొహైల్‌తో మాటలు కలిపిన లార్సెన్.. ‘‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?’’ అని అడిగాడు. దానికి సొహైల్ ‘ఇండియా’ నుంచి వచ్చానని సమాధానమిచ్చాడు. ఆ వెంటనే నిందితుడు ‘‘నువ్వు ముస్లింవా?’’ అని ప్రశ్నించాడు. సొహైల్ ‘అవును’ అని చెప్పి, ఆ వ్యక్తికి తాగడానికి నీళ్ల సీసా అందించేందుకు వెనక్కి తిరిగాడు. అదే సమయంలో లార్సెన్ తన జేబులో ఉన్న కత్తిని తీసి సొహైల్‌పై దాడి చేశాడు.‘‘ముస్లింలను చంపాలనే ఉద్దేశంతోనే నేను మాల్‌లోకి వెళ్లాను. అతడు ముస్లిం అని తెలిసాకే చంపడానికి దాడి చేశాను’’ అని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News