Share News

నడి సముద్రంలో డ్రగ్స్‌ వేట..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:04 AM

నడి సముద్రంలో 526 కేజీల డ్రగ్స్‌తో వెళ్తున్న ఇరానీ బోటును భారతీయ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ) సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్)తో కలిసి అరేబియా సముద్రంలో లక్షద్వీప్‌ సమీపంలో సెప్టెంబరు 25న చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్ల విలువైన 526 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 నడి సముద్రంలో డ్రగ్స్‌ వేట..!

  • ఇరాన్‌ బోటును వెంటాడి పట్టుకున్న భారత కోస్ట్‌ గార్డ్‌

  • రూ.3 వేల కోట్ల విలువైన 526 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం

  • ఐదుగురు పాకిస్థాన్‌ జాతీయులు అదుపులోకి

విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నడి సముద్రంలో 526 కేజీల డ్రగ్స్‌తో వెళ్తున్న ఇరానీ బోటును భారతీయ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ) సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్)తో కలిసి అరేబియా సముద్రంలో లక్షద్వీప్‌ సమీపంలో సెప్టెంబరు 25న చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్ల విలువైన 526 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోటు నడుపుతున్న ఐదుగురు పాకిస్థాన్‌ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐసీజీ, రక్షణ శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సముద్రంపై నిఘా పెట్టి అనుమానాస్పద పడవను గుర్తించామని, ఆ బోటును వెంబడించి లక్షద్వీప్‌ సమీపంలో దాన్ని అడ్డగించామని ఐసీజీ పేర్కొంది.

సీజ్‌ చేసిన మాదకద్రవ్యాల్లో మెథాంఫెటమిన్‌, హెరాయిన్‌ ఉన్నట్టు వెల్లడించింది. ‘ఆజాద్‌’ అనే పేరుతో నడుపుతున్న ఇరాన్‌ బోటును లక్షద్వీ్‌పకు వాయవ్యంగా సుమారు 160 నాటికల్‌ మైళ్ల దూరంలో పట్టుకున్నట్టు వివరించింది. గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తిని ఇటీవల ఓ నైజీరియా జాతీయుడు కలిశాడని, ఇరాన్‌ నుంచి భారత్‌కు 500 కేజీలకుపైగా మెథాంఫెటమిన్‌, హెరాయిన్‌ను అక్రమంగా తరలించేందుకు వారు ప్రణాళిక రచించారని నిఘా వర్గాలు సూచించాయని జోషి తెలిపారు. దీనికి సంబంధించిన నిధులను హవాలామార్గాల ద్వారా మళ్లించారని చెప్పారు. ఈ బోటును గుర్తించేందుకు సెప్టెంబరు 14న ఆపరేషన్‌ మొదలుపెట్టగా.. పది రోజులకుపైగా నిఘాపెట్టి డ్రగ్స్‌ తరలిస్తున్న బోటును సెప్టెంబరు 26న గుర్తించామని గుజరాత్‌ ఏటీసీ డీఐజీ జోషి పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:04 AM