Share News

పాకిస్థాన్ అణు బెదిరింపులకు తలొగ్గం.. ఐక్యరాజ్యసమితిలో భారత్ కౌంటర్..

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:43 PM

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి హెచ్చరిక చేసింది. అణ్వాయుధాల పేరుతో బెదిరింపులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ అణు బెదిరింపులకు తలొగ్గం.. ఐక్యరాజ్యసమితిలో భారత్ కౌంటర్..
Anmol Sher Singh Bedi

ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి హెచ్చరిక చేసింది. అణ్వాయుధాల పేరుతో బెదిరింపులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాద దాడులకు తగిన సమాధానం ఇస్తామని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారిని, దాడులకు కుట్ర పన్నేవారిని ఒకే విధంగా చూస్తామని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్‌లోని మొదటి కమిటీ సమావేశంలో భారత్ తరఫున దౌత్యవేత్త అన్మోల్ షేర్ సింగ్ బేడీ ఈ వ్యాఖ్యలు చేశారు (India Pakistan UN).


అణ్వాయుధాల భయాన్ని చూపిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలను అడ్డుకోవాలని చూడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించదని, పెంచే ప్రమాదం ఉందని అన్మోల్ హెచ్చరించారు. భారత్‌ సైనిక సామర్థ్యాలు రక్షణాత్మక స్వభావం కలిగినవని, దేశ భద్రతా అవసరాల ఆధారంగా వాటిని అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. తమ సైనిక సామర్థ్యాలు ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని రూపొందించినవి కావని స్పష్టం చేశారు (Pak nuclear blackmail).


అంతకు ముందు పాకిస్థాన్.. భారత సైనిక విధానాలను, కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది (India UN statement). 2025 మేలో తమ దేశంపై భారత్‌ చేపట్టిన సైనిక చర్యలను 'దుందుడుకు చర్యలు'గా అభివర్ణించింది. అణ్వాయుధాల ముప్పు ఉన్న పరిస్థితుల్లో పరిమిత సాంప్రదాయ యుద్ధానికి దిగడం ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చింది. అలాగే జమ్మూకశ్మీర్ సమస్యపై చర్చలు జరగాలని, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కారం కనుగొనాలని పాకిస్థాన్‌ కోరింది.


ఇవి కూడా చదవండి..

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

Updated Date - Oct 11 , 2026 | 01:43 PM