ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. త్వరలోనే ఖరారు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:22 PM
ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరనుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా త్వరలో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఐ పేమెంట్స్‌తో పాటు ఏఐ, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి (India Israel trade deal).
రెండు దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగనున్నట్టు ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 27 రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. మరోవైపు గాజాపై ప్రధాని మోదీ మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు. మానవత్వం ఎప్పుడూ సంఘర్షణకు బలికాకూడదని అన్నారు. ప్రస్తుతం శాంతి ప్రణాళిక ద్వారా ఓ ముందడుగు పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు (UPI global expansion).
కాగా, త్వరలోనే భారత పర్యటనకు రావాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహును ఆహ్వానించారు (India Israel partnership). అంతకు ముందు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని నెతన్యాహు ప్రశంసించారు. ఆయన ప్రసంగం ప్రతి ఒక్కరినీ కదిలించిందని అన్నారు. భారత్‌కు రుణపడి ఉన్నామని అన్నారు. మోదీ తమకు స్నేహితుడు కంటే ఎక్కువని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ ప్రభుత్వానికి మరో షాక్.. అలా చేయడం చట్ట విరుద్ధమని తేల్చిన న్యాయస్థానం..
తొమ్మిదేళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్.. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలిపోయింది..