Share News

ట్రంప్ ప్రభుత్వానికి మరో షాక్.. అలా చేయడం చట్ట విరుద్ధమని తేల్చిన న్యాయస్థానం..

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:23 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రపంచ దేశాలపై సుంకాల విషయాల ఇప్పటికే కోర్టు నుంచి వ్యతిరేక తీర్పు రాగా.. తాజాగా వలసదారుల విషయంలోనే అదే అనుభవం ఎదురైంది.

ట్రంప్ ప్రభుత్వానికి మరో షాక్.. అలా చేయడం చట్ట విరుద్ధమని తేల్చిన న్యాయస్థానం..
Trump immigration policy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రపంచ దేశాలపై సుంకాల విషయాల ఇప్పటికే కోర్టు నుంచి వ్యతిరేక తీర్పు రాగా.. తాజాగా వలసదారుల విషయంలోనూ అదే అనుభవం ఎదురైంది. అక్రమ వలసదారులను వారికి సంబంధం లేని ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది (Trump immigration policy).


అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను అమెరికా నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. దీంతో ఈ తరలింపు ముప్పును ఎదుర్కొంటున్న వలసదారులు కోర్టులో దావా వేశారు (third country deportation ruling).


ఆ దావాపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్ట విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది (federal court immigration case). ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల సమయం ఇచ్చింది.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 03:23 PM