Share News

తొమ్మిదేళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్.. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలిపోయింది..

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:59 PM

తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

తొమ్మిదేళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్.. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలిపోయింది..
9 year old girl death

తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో విషాదకర విషయం ఏంటంటే.. ఆ బాలిక అన్న కూడా కొన్ని నెలల కిందట కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు (9 year old girl death).


రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన రాజేంద్ర బపేడియా అనే వ్యక్తి తొమ్మిదేళ్ల కూతురు దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎప్పటిలాగానే దివ్య స్కూల్‌కు వచ్చింది. ఉదయం ప్రేయర్ సమయానికి ముందు తోటి పిల్లలతో కలిసి స్కూల్‌ గ్రౌండ్‌లో ఆడుకుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి దివ్య కుప్పకూలిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆ బాలికను హాస్పిటల్‌కు తరలించారు (cardiac arrest in school).


హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది (student dies of heart attack). బాలిక శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు. దీంతో ఆ బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగానే చనిపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. దివ్య అన్న అభిషేక్ కూడా కొన్ని నెలల కిందట ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా దివ్య కూడా అదే తరహాలో ప్రాణాలు కోల్పోయింది. నెలల వ్యవధిలోనే రాజేంద్ర కుటుంబం ఇద్దరు పిల్లలనూ కోల్పోవడం విషాదకరం.


ఇవి కూడా చదవండి:

రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 26 , 2026 | 04:00 PM