Share News

'కష్టసుఖాల్లో మాకు భారత్ ఎప్పుడూ అండగా ఉంది': నేపాల్

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:46 PM

సుఖదుఃఖాల్లో భారత్ తమకు ఎల్లప్పుడూ అండగా ఉందని నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా అన్నారు. భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు భారత్ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిందని ఆమె వెల్లడించారు.

'కష్టసుఖాల్లో మాకు భారత్ ఎప్పుడూ అండగా ఉంది': నేపాల్
India Helping Nepal With DNA Testing, Dead Body Management: Health Minister

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 2: భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు భారత్ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిందని ఆమె వెల్లడించారు. నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి నిషా మెహతా ప్రశంసించారు. కష్టసుఖాల్లో భారత్ ఎప్పుడూ మాకు అండగా ఉందని నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా కొనియాడారు.


వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాలను వెలికితీయడం, వారిని గుర్తించడం, డీఎన్‌ఏ(DNA) పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటులో భారత్ అందిస్తున్న సహాయాన్ని నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు.


'రోటీ-బేటీ' బంధం: భారత్, నేపాల్ దేశాల మధ్య సంబంధం 'రోటీ-బేటీ' వంటిదని, ఇది కుటుంబ సదృశ్యమైన సోదరభావంతో కూడుకున్నదని నిషా మెహతా తెలిపారు. మంచి సమయాల్లోనే కాకుండా, కష్టకాలంలో కూడా భారత్ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.


డీఎన్‌ఏ పరీక్షలు.. ల్యాబ్ సహాయం: వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ నేపాల్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దీనికోసం భారత్ ప్రత్యేకాధికారుల నిపుణుల బృందాన్ని (Expert Team) పంపడంతో పాటు, నేపాల్‌లో డీఎన్‌ఏ నిర్వహణ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలోనూ పూర్తి సహకారాన్ని అందిస్తోందని ఆమె వెల్లడించారు.


సహాయక చర్యలు, నివాస కేంద్రాలు: వరదల నుంచి సురక్షితంగా రక్షించిన ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఉంచి, వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని వివరించారు. కాగా, నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,127కు చేరుకున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.


రికవరీ చేసిన మొత్తం మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తింపు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మిగిలిన మృతదేహాలను త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అందజేయడంలో భారత నిపుణుల బృందం అందిస్తున్న డీఎన్‌ఏ సహాయం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.



ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 02 , 2026 | 05:28 PM