సౌదీ సైనిక ట్రక్కులపై హౌతీల దాడులు.. ప్రతీకారం తప్పదన్న రియాద్..
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:47 PM
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మద్దతు ఉన్న బలగాల మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. సౌదీ భూభాగం నుంచి సైనిక సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులపై దాడి చేసిన వీడియోను హౌతీలు విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మద్దతు ఉన్న బలగాల మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. సౌదీ భూభాగం నుంచి సైనిక సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులపై దాడి చేసిన వీడియోను హౌతీలు విడుదల చేశారు. అల్-వదియాహ్ సరిహద్దు ప్రాంతం సమీపంలో ఈ దాడి జరిగినట్లు హౌతీ మీడియా సెంటర్ పేర్కొంది (Houthi attack Saudi Arabia).
హౌతీలకు చెందిన మీడియా విభాగం విడుదల చేసిన వీడియోలో, సైనిక సామగ్రిని తరలిస్తున్నట్లు చెబుతున్న పలు ట్రక్కులు మంటల్లో చిక్కుకుని పేలుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడి సౌదీ-యెమెన్ సరిహద్దులోని అల్-వదియాహ్ క్రాసింగ్ సమీపంలో జరిగింది. యెమెన్‌లోని హౌతీలకు చెందిన పలు ప్రాంతాలపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసిందని, అందుకు ప్రతిస్పందనగానే సౌదీపై విస్తృత దాడులు చేపట్టినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు (Saudi Yemen border attack).
హౌతీల దాడులపై సౌదీ అరేబియా స్పందించింది (Saudi Houthi conflict). తమ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని రియాద్ స్పష్టం చేసింది. హౌతీల ముప్పును తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్-మాలికీ తెలిపారు. మరోవైపు హౌతీలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ప్రకటించారు. సౌదీ భూభాగంలో మరింత తీవ్ర దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..