ట్రంప్ ముఖచిత్రంతో బంగారు నాణెం
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:24 AM
బ్రిటన్ నుంచి అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లవుతున్న సందర్భంగా.. ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24 క్యారెట్ల బంగారు నాణేన్ని విడుదల చేసేందుకు అమెరికా మింట్...
వాషింగ్టన్, మార్చి 21: బ్రిటన్ నుంచి అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లవుతున్న సందర్భంగా.. ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24 క్యారెట్ల బంగారు నాణేన్ని విడుదల చేసేందుకు అమెరికా మింట్ సిద్ధమైంది. అమెరికా నిబంధనల ప్రకారం.. జీవించి ఉన్న అధ్యక్షుడి బొమ్మను నాణేలపై ముద్రించకూడదు. కానీ, ఇది స్మారక నాణెం కావడంతో ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. 1926లో.. అమెరికాకు అప్పటికి స్వాతంత్య్రం వచ్చి 150 ఏళ్లయిన సందర్భంగా అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ ముఖచిత్రంతో ‘అర డాలరు’ స్మారక నాణేన్ని ముద్రించారు. అయితే, ఆ నాణెంపై కూలిడ్జ్‌తోపాటు జార్జి వాషింగ్టన్ ముఖచిత్రం కూడా ఉంటుంది. కానీ, ఈసారి ట్రంప్ ఒక్కరి ముఖం మాత్రమే నాణెంపై ఉంటుంది. కాగా, ట్రంప్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. లండన్ కేంద్రంగా పనిచేసే డేటా స్ట్రేటజీ సంస్థ జేఎల్ పార్ట్‌నర్స్‌తో కలిసి అమెరికాలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 42 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 48ు ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News