ఫ్రాన్సిస్ హాల్జెన్‌ను వరించిన నోబెల్.. ఫిజిక్స్ విభాగంలో పురస్కారం
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:52 PM
ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీపై కృషి చేసినందుకు, అత్యంత శక్తిమంతమైన ఖగోళ న్యూట్రినోలను గుర్తించినందుకు శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు నోబెల్ బహుమతి లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: భౌతిక శాస్త్ర విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు నోబెల్ బహుమతి దక్కింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీపై కృషి చేసినందుకు, అత్యంత శక్తిమంతమైన ఖగోళ న్యూట్రినోలను గుర్తించినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ఈరోజు (మంగళవారం) స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
బెల్జియంకు చెందిన ఫ్రాన్సిస్ హాల్జెన్ (82) అమెరికాలోని మాడిసన్‌లో ఉన్న విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 1880లో ఆయన ఖగోళ న్యూట్రినోలపై పరిశోధనలు చేశారు. ‘ఫ్రాన్సిస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ప్రపంచానికి ఖగోళశాస్త్రంలో ఒక కొత్త ఆవిష్కరణను అందించింది’ అని నోబెల్ కమిటీ సభ్యుడు మార్క్ పియర్స్ కొనియాడారు. కాగా ఈ ఏడాది నోబెల్ గ్రహీతకు ప్రైజ్‌మనీ కింద 1.2 మిలియన్ డాలర్లు (దాదాపుగా పదకొండున్నర కోట్ల రూపాయలు) అందిచనున్నారు.
ఈ వార్తలూ చదవండి
సల్మాన్ ఇంట్లో డిన్నర్.. బీజేవైఎం నేత సాయి ప్రసాద్ పోస్ట్ వైరల్..
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక..