Share News

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక..

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:05 PM

ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్షాల నిరసన కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ల జాబితా అవకతవకలకు బాధ్యులైనవారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్షాల నిరసన కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ల జాబితా అవకతవకలకు బాధ్యులైనవారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు (Rahul Gandhi Warning).


పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన మార్చ్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు వచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయం కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. తాము దేశ ప్రజల ప్రతినిధులమని, ఎన్నికల కమిషనర్లను కలవడం తమ హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు (INDIA bloc protest).


నిరసన సందర్భంగా బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు (SIR row). 'మేము వారిని కేవలం ఎదుర్కోవడం కాదు.. వారిని ఓడిస్తాం' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను దేశద్రోహంగా భావిస్తున్నానని, దీనికి బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. తన పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికేనని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పనైపోయిందని, ఆయన రాజీనామా చేసే సమయం ఆసన్నమైందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..


మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 04:06 PM