యూకేలో బెయిల్.. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ ఎన్నికలలో విజయం..
ABN , Publish Date - Aug 06 , 2026 | 09:30 PM
యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సార్ అహ్మద్, తాజాగా జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో చిన్నారులపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న పాకిస్థాన్ మాజీ మంత్రి రుఖ్సార్ అహ్మద్, తాజాగా జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ అభ్యర్థిగా మీర్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు (Rukhsar Ahmed PoK Election).
2024లో రుఖ్సార్ అహ్మద్‌ను గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన 1990లలో మాంచెస్టర్‌లోని సంరక్షణ గృహాల్లో నివసించిన బాలికలపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇంకా తుది తీర్పు వెలువడలేదు. బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు (UK Child Abuse Probe).
పీఓకేలో రుఖ్సార్ అహ్మద్ విజయం పాకిస్థాన్‌తో పాటు బ్రిటన్‌లో కూడా రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది. ఒకవైపు తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఎన్నికల్లో ఆయన గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. బెయిల్ నిబంధనల ప్రకారం ఆయన తరచుగా మాంచెస్టర్ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే యూకే నుంచి మీర్‌పూర్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో యూకేలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..
హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..