తప్పులు చేశాను.. మళ్లీ ఎన్విడియా సీఈవోగా రావడానికి రెడీ
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:33 AM
వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పులు చేశానని ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ అంగీకరించారు
తప్పులు చేశాను.. మళ్లీ ఎన్విడియా సీఈవోగా రావడానికి రెడీ
న్యూయార్క్, నవంబరు 17: వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పులు చేశానని ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ అంగీకరించారు. ఎన్విడియా కంపెనీ సీఈవో పదవి తిరిగి చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్టు సంకేతం ఇచ్చారు. గత వారం సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తొలిసారిగా మంగళవారం ఎక్స్ వేదికపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నేను తిరిగిరావడం వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీకి ప్రయోజనకరమని ఎన్విడియా బోర్డు భావిస్తే.. తిరిగి సీఈవో బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తానని ప్రకటించారు. ఎన్విడియా ఉద్యోగులు, వాటాదారుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని జెన్సెన్ చెప్పారు. చైనా గూఢచారి అలిస్తో వివాహేతర సంబంధం వ్యవహారంపై కంపెనీ చేపట్టినస్వతంత్ర దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా