Share News

ఇరాన్‌ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:37 AM

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఖార్గ్ ఐలాండ్‌లో మరో ఆయిల్ ట్యాంక్‌పై అగ్రదేశం దాడి చేసింది. దీంతో జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది.

ఇరాన్‌ నౌకలపై విరుచుకుపడ్డ అమెరికా.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..
US strikes Iran

ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులనుంచి అమెరికన్ యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్‌కు చెందిన ఐదు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్వయంగా వెల్లడించింది.


గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఖార్గ్ ఐలాండ్‌లో మరో ఆయిల్ ట్యాంక్‌పై అగ్రదేశం దాడి చేసింది. దీంతో జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. దాదాపు 18 నుంచి 20 మిసైళ్లను వదిలింది. ఎయిర్ బేస్‌లోని డిఫెన్స్ సిస్టమ్స్ ఆ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి.


ఆయిల్ ధరలపై ట్రంప్ పోస్టు..

ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా విజయం సాధించిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో గ్యాలన్‌ పెట్రోల్ ధర 2 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ' ది ట్రూత్ సోషల్'‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్

మచ్చే పట్టించింది..

Updated Date - Sep 09 , 2026 | 10:22 AM