హోర్ముజ్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు.. మూడు నౌకలు ధ్వంసం..
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:47 AM
అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసిన నేపథ్యంలో.. అమెరికాకు చెందిన మూడు నౌకలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులు చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య హోర్ముజ్ జలసంధిలో ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసిన నేపథ్యంలో.. అమెరికాకు చెందిన మూడు నౌకలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులు చేసింది. అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మరో మూడు ఆయిల్ ట్యాంకర్లపై కూడా ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ నేవీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఐఆర్‌జీసీ సోషల్ మీడియా పోస్టు ప్రకారం.. ‘అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం. మరో ప్రాంతంలో పిల్లలను చంపే అమెరికాకు చెందిన మూడు నౌకలను కూడా ధ్వంసం చేశాం. గల్ఫ్‌తో పాటు హోర్ముజ్ జలసంధి సమీపంలో రాకపోకలు సాగించే నౌకలు అమెరికా బలగాలను నమ్మి మోసపోకండి. అనుమతి లేని మార్గాలలో ప్రయాణిస్తే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుంది’ అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
అమెరికా దాడులకు కారణం ఇదే..
అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా నౌకలు ఈ దాడుల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతీకార దాడులు చేసింది. ఖర్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో ఐఆర్‌జీసీకి చెందిన రెండు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను పూర్తిగా ధ్వంసం చేసింది. వీటితో పాటు ఒమన్ గల్ఫ్‌లో ఖాళీగా ఉన్న మరొక ఆయిల్ ట్యాంకర్ మీద కూడా అమెరికా దాడి చేసింది.
ఇవి కూడా చదవండి
అట్రాసిటి కేసుల విచారణ వేగవంతం చేయాలి