డెమోక్రాట్లు గెలిస్తే.. ‘మిస్టర్ వీటో’గా మారతా!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:08 AM
మధ్యంతర ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీని ఓడించి ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి ఓటర్లు పట్టం కడితే తాను.. ‘మిస్టర్ వీటో’గా మారుతానని ట్రంప్ హెచ్చరించారు
బిల్లులన్నింటినీ తిరస్కరిస్తా దాంతో వాళ్లే దారికొస్తారు
మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, నవంబరు 2: మధ్యంతర ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీని ఓడించి ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి ఓటర్లు పట్టం కడితే తాను.. ‘మిస్టర్ వీటో’గా మారుతానని ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికల తర్వాత డెమోక్రాట్లు గెలిచి, కాంగ్రెస్ (అమెరికా చట్టసభల)పై పట్టు సాధించినా కూడా వాళ్లు పంపించే బిల్లులను తాను ఆమోదించనని, వీటో చేస్తానని చెప్పారు. బిల్లులన్నింటినీ వీటో చేస్తుంటే వాళ్లే (డెమోక్రాట్లు) ఒకట్రెండు నెలల తర్వాత తలొగ్గుతారని, దాంతో ఇరుపార్టీల మధ్య ఓ ఒప్పందం కుదురుతుందన్నారు. అయితే, ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోవటం లేదని చెప్పారు. కాగా, అమెరికా రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పంపించే బిల్లులను అధ్యక్షుడు తిరస్కరించినా కూడా.. 2/3 మెజారిటీతో చట్టసభలు ఆమోదించుకునే వెసులుబాటు ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి