చైనాలో దారుణం.. గ్లూ గన్‌తో చిన్నారి పెదవిని కాల్చిన టీచర్..
ABN , Publish Date - Jun 08 , 2026 | 09:49 PM
చైనాలో ఓ టీచర్ విచక్షణ మరిచి ప్రవర్తించింది. తరగతి గదిలో మాట్లాడుతోందనే కోపంతో 4 ఏళ్ల చిన్నారికి భయంకరమైన శిక్ష విధించింది. వేడి గ్లూ గన్‌ను రెండుసార్లు పెదవికి తాకించి కాల్చింది.
చైనాలో ఓ టీచర్ విచక్షణ మరిచి ప్రవర్తించింది. తరగతి గదిలో మాట్లాడుతోందనే కోపంతో 4 ఏళ్ల చిన్నారికి భయంకరమైన శిక్ష విధించింది. వేడి గ్లూ గన్‌ను రెండుసార్లు పెదవికి తాకించి కాల్చింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు (China teacher suspended).
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఫెంగ్‌షియాన్ కౌంటీలో మే 27న ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్లాస్‌లో మాట్లాడినందుకు కొంతమంది చిన్నారులను టీచర్ పిలిచి శిక్షించింది. మొదట ఒక బాలుడి అరచేతికి గ్లూ గన్ తాకించింది. ఆ తర్వాత 4 ఏళ్ల బాలికను తన ముందుకు లాగి ఆమె పై పెదవికి రెండుసార్లు వేడి గ్లూ గన్‌ను తాకించింది. ఈ ఘటన తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారి పెదవిపై బొబ్బలు ఏర్పడ్డాయి (Kindergarten teacher China).
బాలిక పరిస్థితి మరింత విషమించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు (China glue gun incident). అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రారంభంలో ఈ గాయం ప్రమాదవశాత్తు జరిగిందని టీచర్ బుకాయించింది. అయితే సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..
ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన..