Share News

చైనా అంతరిక్ష నౌకలో పాక్‌ వ్యోమగామి

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:18 AM

అంతరిక్ష రంగంలో చైనా మరో ఘనత సాధించింది.

చైనా అంతరిక్ష నౌకలో పాక్‌ వ్యోమగామి
austronut

బీజింగ్‌/జియుక్వాన్‌, నవంబరు 25: అంతరిక్ష రంగంలో చైనా మరో ఘనత సాధించింది. పాకిస్థాన్‌కు చెందిన తొలి వ్యోమగామితో కూడిన మానవసహిత అంతరిక్ష నౌక ‘షెన్‌జౌ-24’ను విజయవంతంగా ప్రయోగించింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ‘లాంగ్‌ మార్చ్‌-ఎఫ్‌2’ రాకెట్‌ ద్వారా బుధవారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీనిలో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ జీషన్‌ అలీ (40) సహా ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. కాగా, తమ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం చరిత్రలో చైనా ఒక విదేశీయుడిని అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ బృందంలో పాక్‌ వైమానిక దళ కమాండర్‌ మహ్మద్‌ జీషన్‌ అలీ పేలోడ్‌ స్పెషలిస్ట్‌గా ప్రయాణించగా... చైనా వ్యోమగాములు టాంగ్‌ హాగ్‌బో (కమాండర్‌), వుయి(ఫ్లైట్‌ ఇంజనీర్‌)గా వ్యవహరిస్తున్నారు. 3.5 గంటల తర్వాత ఈ వ్యోమనౌక చైనా సొంత అంతరిక్ష కేంద్రమైన ‘తియాంగాంగ్‌’తో అనుసంధానమైంది. ఇరుదేశాల వ్యోమగాములు చేపట్టిన ఈ సంయుక్త అంతరిక్షయాత్ర సందర్భంగా చైనా, పాకిస్థాన్‌ అధ్యక్షులు షి జిన్‌పింగ్‌, ఆసిఫ్‌ అలీ ఒకరినొకరు అభినందించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నిం

Updated Date - Nov 26 , 2026 | 06:58 AM