Share News

చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..

ABN , Publish Date - May 26 , 2026 | 07:09 AM

చిలీలో తీవ్ర భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉత్తర చిలీ ప్రాంతం కలామా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..

శాంటియాగో: చిలీలో తీవ్ర భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉత్తర చిలీ ప్రాంతం కలామా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అటకామా ఎడారి ప్రాంతంలో దాదాపు 100 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని తెలిపింది. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు పేర్కొంది. అయితే, ఎటువంటి ప్రాణ, భారీ ఆస్తి నష్టం జరగలేదని యూఎస్జీఎస్ తెలిపింది.


అరికా, తారాపాకా, ఆంటోఫాగస్టా, అటకామా ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు భారీ భూకంపంతో చిలీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు కంపించడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దక్షిణ అమెరికా దేశం ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశాలలో ఒకటి ఉంది.


చిలీ భూభాగంలో నాజ్కా, దక్షిణ అమెరికా, అంటార్కిటిక్ టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తాయి. దీని వల్ల అక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి. అయితే, 1960లో వచ్చిన భూకంపాన్ని అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఆ సమయంలో దీని తీవ్రత 9.5గా నమోదు కాగా.. 9,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లోనూ మధ్య చిలీ తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం రాగా.. సునామీ ఏర్పడి 520 మంది మృతిచెందారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

Updated Date - May 26 , 2026 | 07:27 AM