ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - May 26 , 2026 | 05:58 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు మరణించడంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు...
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు మరణించడంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 4న పోలింగ్ జరిపి, వెంటనే ఫలితాలు ప్రకటించాలని సూచించింది.