Share News

ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన యువతిని బిలావల్ భుట్టో పెళ్లి చేసుకోబోతున్నారా..

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:03 PM

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తలపై పీపీపీ స్పందించింది.

ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన యువతిని బిలావల్ భుట్టో పెళ్లి చేసుకోబోతున్నారా..
Bilawal Bhutto marriage

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తలపై పీపీపీ స్పందించింది. యూరోపియన్ రాజకుటుంబానికి చెందిన యువతితో బిలావల్ వివాహం జరగబోతోందన్న వార్తలను పీపీపీ నేత, కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ ఖండించారు. ఈ వార్తలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు (Bilawal Bhutto marriage).


బిలావల్ భుట్టో జర్దారీ, యూరప్‌లోని ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన యువతిని వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం మొదలైంది. ఆయన తండ్రి, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల యూరప్‌లోని లీచ్టెన్‌స్టెయిన్‌కు వెళ్లి తన కుమారుడి పెళ్లి తేదీని ఖరారు చేసేందుకు చర్చలు జరిపారని కొన్ని పోస్టులు పేర్కొన్నాయి. బిలావల్ కాబోయే భార్య మాజీ ఆస్ట్రియన్ ఆర్చ్‌డచెస్ గ్లోరియా వాన్ హాబ్స్‌బర్గ్ అని కూడా వార్తలు వచ్చాయి (Bilawal Bhutto European princess).


ఈ వార్తలపై ముర్తజా వహాబ్ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు (Bilawal Bhutto marriage rumours). బిలావల్ భుట్టో జర్దారీ నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన వార్తలు నిజాలు కావని, నిరాధారమైనవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..


పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

Updated Date - Aug 30 , 2026 | 07:30 PM