రెండు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు పదేళ్ల జైలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:55 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో స్థానిక కోర్టు సోమవారంనాడు పదేళ్ల జైలుశిక్ష విధించింది.
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో స్థానిక కోర్టు సోమవారంనాడు పదేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న కేసుల్లో ఢాకా ప్రత్యేక న్యాయవాదుల కోర్టు-4 న్యాయమూర్తి రాబిల్ ఆలమ్ ఈ తీర్పు వెలువరించారు. హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్లు చొప్పున మొత్తంగా పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేశారు.
హసీనాతో పాటు ఆమె మేనల్లుడు రాడ్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్ధిక్, అజ్మీనా సిద్ధిక్‌లకు కూడా కోర్టు జైలుశిక్ష విధించింది. తులిప్ సిద్ధిక్‌కు నాలుగేళ్లు, రాడ్వాన్, అజ్మీనాలకు ఏడేళ్లు చొప్పున జైలుశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో కోర్టుకు లొంగిపోయిన మహ్మద్ ఖుర్షీద్ ఆలంకు ఒక్కో కేసులో ఏడాది చొప్పున రెండేళ్ల జైలు విధించింది. జైలు శిక్ష పడిన వారిందరీ లక్ష రూపాయల చొప్పున జరిమానాను కూడా కోర్టు విధించింది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. షేక్ హసీనాతో సహా ఇతరులపై అవినీతి నిరోధక కమిషన్ ఈ కేసులను నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
దలైలామాకు గ్రామీ అవార్డును ఖండించిన చైనా
రెండ్రోజుల్లో డీల్ కుదరకపోతే.. అది నిజమో, కాదో తేలుతుంది.. ఇరాన్ వార్నింగ్‌పై ట్రంప్ రియాక్షన్..