Share News

ఒక్కొక్కరికి 925 కోట్లపైనే..!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:47 AM

ఆంథ్రోపిక్‌ సంస్థ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన క్షణమే, అక్కడ పనిచేసే 5300 మంది ఉద్యోగుల్లో ఏకంగా 5100 మంది(96) కోటీశ్వరుల జాబితాలోకి చేరిపోయారు.

ఒక్కొక్కరికి 925 కోట్లపైనే..!
a.pic

  • ఆంథ్రోపిక్‌లో 600 మంది ఉద్యోగుల ఆస్తి ఇది..

  • లిస్టింగ్‌తో 96 శాతం మంది కోటీశ్వరులే

న్యూఢిల్లీ, నవంబర్‌ 20: ఆంథ్రోపిక్‌ సంస్థ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన క్షణమే, అక్కడ పనిచేసే 5300 మంది ఉద్యోగుల్లో ఏకంగా 5100 మంది(96) కోటీశ్వరుల జాబితాలోకి చేరిపోయారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ‘నాస్‌డాక్‌’లో గురువారం ఆంథ్రోపిక్‌ షేరు ఐపీవో ధర 83 డాలర్లతో పోల్చితే.. 34శాతంలాభంతో 111.50 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. చివరకు 97.17 డాలర్ల వద్ద స్థిరపడగా.. కంపెనీ విలువ 1.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో కంపెనీలో వాటాలున్న వ్యవస్థాపకుల నుంచి.. సాధారణ ఉద్యోగుల వరకు అందరిపై కాసుల వర్షం కురిసింది. ఆంథ్రోపిక్‌ వ్యవస్థాపకులైన సీఈవో డారియో ఆమోదీ, టామ్‌ బ్రౌన్‌, శామ్‌ మెక్‌కాండ్లిష్‌, క్రిస్టోఫర్‌ ఓలా, జాక్‌ క్లార్క్‌, జేర్డ్‌ కప్లాన్‌, డానియెల్‌ ఆమోడీ.. ఈ ఏడుగురి వాటాల విలువ సుమారు 20 బిలియన్‌ డాలర్లకు (ఒక్కొక్కరి వద్ద రూ.1.85 లక్షల కోట్లు) పెరిగింది. భారత సంతతికి చెందిన సీఎ్‌ఫవో కృష్ణారావు వాటాల విలువ 788.3 మిలియన్‌ డాలర్లకు (రూ.7,300కోట్లు) చేరింది. ఆంథ్రోపిక్‌లో మొత్తం 5300 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5100 మందికి సగటున కంపెనీలో ఉన్న వాటాల విలువ పది లక్షల డాలర్లకు (ఒక్కొక్కరికి సుమారు రూ.9.25 కోట్లు) మించిందని అంచనా. కంపెనీలో తొలి దశలో చేరిన/సీనియర్‌ ఉద్యోగులు 600 మంది వాటాల విలువ పది కోట్ల డాలర్ల (ఒక్కొక్కరికి సుమారు రూ.925 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది. ఇక కంపెనీ ఆరంభ దశలో పెట్టుబడి పెట్టిన వారికీ పంట పండింది. ఐకానిక్‌ క్యాపిటల్‌ వాటాల విలువ ఏకంగా రూ.2.77 లక్షల కోట్లకు చేరింది.

ఇవి కూడా చదవండి..

ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 03:12 AM