అలాస్కాలో కూలిన విమానం.. నలుగురి మృతి
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:49 PM
అమెరికాలోని అలాస్కాలో విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్డోవియా వెళ్తున్న చిన్న విమానం నీటిలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని అలాస్కాలో విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్డోవియా వెళ్తున్న చిన్న విమానం నీటిలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు. బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా బయటపడలేదు (Seldovia plane crash).
పైపర్ పీఏ-24 విమానం బుధవారం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి సెల్డోవియా వైపు పయనమైంది. సెల్డోవియా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలోపే విమానం అదుపు తప్పి సెల్డోవియా స్లఫ్ (Seldovia Slough)లోని నీటిలో కూలిపోయింది. ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సుమారు 15 అడుగుల లోతులో విమానం ఉన్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అలాస్కా ప్రాంతీయ అధికారి క్లింట్ జాన్సన్ తెలిపారు (Alaska aircraft crash).
నీటి మట్టం, ఆటుపోట్ల కారణంగా రెస్క్యూ సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకోలేకపోయారు (Alaska plane accident). ఆ తర్వాత అతి కష్టం మీద అధికారులు విమానం వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. విమానంలో ఉన్న నలుగురూ వయసులో పెద్దవారేనని అధికారులు తెలిపారు. మృతదేహాలను వైద్య పరీక్షల కోసం స్టేట్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు. విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..