81 ఏళ్ల వయసులో బుకర్ ప్రైజ్!
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:25 AM
బ్రిటిష్ రచయిత ఎం.జాన్ హారిసన్ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్-2026ను గెలుచుకున్నారు
బ్రిటిష్ రచయిత జాన్ హారిసన్‌కు అరుదైన గౌరవం
లండన్, నవంబరు 10: బ్రిటిష్ రచయిత ఎం.జాన్ హారిసన్ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్-2026ను గెలుచుకున్నారు. ఆయన రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ నవలకు ఈ పురస్కారం దక్కింది. 81 ఏళ్ల వయసులో బుకర్ ప్రైజ్ అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడైన రచయితగా హారిసన్ రికార్డు సృష్టించారు. ఆరు దశాబ్దాలుగా రచనా రంగంలో కొనసాతున్న ఆయన రాసిన ఈ నవల కేవలం 198 పేజీలతో ఈ ఏడాది షార్ట్‌లిస్ట్‌లో అతి చిన్న నవలగా నిలిచింది. ఈ నవల పాఠకుల్లో ఆశావాదాన్ని నింపుతుందని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల కమిటీ పేర్కొంది. తుదిజాబితాలో ఆరు నవలలను పరిశీలించి హారిసన్ నవలను ఎంపిక చేసినట్లు కమిటీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..