Share News

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

ABN , Publish Date - Jun 02 , 2026 | 03:22 PM

యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. త్వరలో వారిని స్వదేశానికి పంపుతామని స్పష్టం చేసింది.

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

న్యూయార్క్,జూన్02: యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. త్వరలో వారిని స్వదేశానికి పంపుతామని స్పష్టం చేసింది. అరిజోనాలో యూమా సెక్టార్‌లో సరిహద్దు తనిఖీల్లో భాగంగా 52 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించింది. వారిలో 36 మంది ట్రక్ డైవర్లుగా పని చేస్తున్నారని తెలిపింది. అందులో 30 మంది భారతీయులు కాగా.. మిగిలిన వారు మెక్సికో, ఎల్ సాల్వెడార్, రష్యాలకు చెందిన వారని పేర్కొంది.


అయితే వీరిలో కొందరు వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా తదితర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ పొందారని వివరించింది. మరికొందరు వద్ద ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్‌ లేవని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్పష్టం చేసింది. తనిఖీల్లో భాగంగా వీరి వద్ద జో బైడెన్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉపాధి పత్రాలను గుర్తించామని తెలిపింది. కానీ ఇప్పుడవి చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఫెడరల్ చట్టం ప్రకారం వారందరిని స్వదేశానికి పంపుతామని పేర్కొంది.


అమెరికాలో ఇటీవల వాణిజ్య వాహనాలను నడుపుతూ భారతీయ సంతతికి చెందిన పలువురు ట్రక్ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ప్రమాదాలు నివారించేందుకు ప్రతి రోజు తనిఖీలు చేపట్టినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి: నెతన్యాహూపై ట్రంప్ ఆగ్రహం

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్

For More International News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 03:35 PM