నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి: నెతన్యాహూపై ట్రంప్ ఆగ్రహం
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:12 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపట్టిన తాజా సైనిక చర్యల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపట్టిన తాజా సైనిక చర్యల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో దాడులను కొనసాగించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నెతన్యాహూతో ఫోన్‌లో ఘాటుగా మాట్లాడినట్లు సమాచారం (Trump angry on Netanyahu).
'నువ్వు పిచ్చివాడివి. నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌పై కూడా వ్యతిరేకత పెరుగుతోంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు' అని నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. హెజ్‌బొల్లాకు చెందిన ఓ సైనిక కమాండర్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమాయకులైన లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది (Trump Netanyahu call).
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇటీవల ఇజ్రాయెల్ హెచ్చరించింది (Israel Hezbollah). లెబనాన్‌పై దాడులు చేస్తే శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. దీంతో నెతన్యాహుతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత హెజ్‌బొల్లా నాయకులతోనూ మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా ట్రంప్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..