Winter Sugar Cravings: శీతాకాలంలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే..ఇలా చేయండి.!
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:53 AM
శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే ఫుడ్‌ను తినాలనిపిస్తుంది. ఎక్కువగా వేడి వేడి ఆహారాలు, స్వీట్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. శీతాకాలంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచేందుకు తీసుకోవాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో మన ఆహారపు అలవాట్లు మారిపోతాయి. వేడి వేడి వంటకాలు, స్వీట్లు తినాలనే కోరిక ఎక్కువవుతుంది. డయాబెటిస్ ఉన్నవారికీ తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. కానీ, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందుకే ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శీతాకాలంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దీంతో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, తీపి పదార్థాలపై కోరిక పెరుగుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారు తీపి తింటే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది గుండె, కిడ్నీ సమస్యలకు కూడా దారి తీస్తుంది.
ఏం చేయాలి..
డాక్టర్ సూచన మేరకు తీపి తినాలనిపిస్తే బెల్లం చాలా కొద్దిగా మాత్రమే తీసుకోండి. ఆపిల్, బేరి, జామ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు తినండి. రోజుకు ఒక ఖర్జూరం తీసుకోవచ్చు. భోజనంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. పప్పులు, శెనగలు, మొలకెత్తిన ధాన్యాలు, సలాడ్లు తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, పరిమితంగా తినడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగండి. నీరు తాగడం వల్ల కూడా తీపి కోరిక కొంత తగ్గుతుంది. శీతాకాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారు తమ ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..
రెండు రోజులకు ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేయండి.
డాక్టర్ ఇచ్చిన మందులు సమయానికి తీసుకోండి.
రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
For More Latest News