Share News

పురుషుల కంటే స్త్రీలకు చలి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుందో తెలుసా..?

ABN , Publish Date - Jan 20 , 2026 | 07:42 PM

ఒకే వాతావరణంలో ఉన్నప్పటికీ పురుషుల కంటే స్త్రీలకు చలి ఎక్కువగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, పురుషుల కంటే స్త్రీలకు చలి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషుల కంటే స్త్రీలకు చలి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుందో తెలుసా..?
Cold Sensitivity in Women

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో చలిగా అనిపించడం సాధారణం. అయితే, ఒకే వాతావరణంలో ఉన్నప్పటికీ పురుషుల కంటే స్త్రీలకు చలి ఎక్కువగా అనిపిస్తుందని అంటారు. అయితే పురుషుల కంటే స్త్రీలకు చలి ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


జీవక్రియ..

మన శరీరంలో జీవక్రియ వేగంగా ఉంటే ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటి వారికి చలి తక్కువగా అనిపిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉన్నవారికి శరీరంలో వేడి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి చలి ఎక్కువగా అనిపిస్తుంది.

రక్త ప్రసరణ కూడా కారణమే..

శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే చేతులు, కాళ్లు ఎక్కువగా చల్లగా మారతాయి. రక్త ప్రసరణ మంచిగా ఉన్నవారికి మాత్రం చలి అంతగా అనిపించదు. శరీర ఆకారం, బరువు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే చలి తక్కువగా అనిపిస్తుంది.


స్త్రీలకు ఎందుకు ఎక్కువ చలి అనిపిస్తుంది?

పురుషులతో పోలిస్తే స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరగా చలి అనిపిస్తుంది. అలాగే స్త్రీలలో కండరాల పరిమాణం తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. కండరాలు ఎక్కువగా ఉంటే శరీరంలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

వయస్సు, జీవనశైలి ప్రభావం..

వయస్సు పెరిగే కొద్దీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి తగ్గుతుంది. అందుకే వృద్ధులకు చలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే తక్కువ నీరు తాగడం, ఎక్కువగా కాఫీ లేదా టీ తాగడం వంటి అలవాట్లు కూడా శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 20 , 2026 | 08:44 PM