Winter Lung Care Tips: శీతాకాలంలో మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..!
ABN , Publish Date - Jan 08 , 2026 | 02:03 PM
మనం సాధారణంగా బరువు, చర్మం, జుట్టు, జీర్ణక్రియ గురించి ఆలోచిస్తాం కానీ ఊపిరితిత్తుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ, అవే మన శ్వాసను నియంత్రించి, మన జీవితానికి ఆధారంగా ఉంటాయి. ఉష్ణోగ్రత మార్పులు వంటి కారణాల వల్ల ఊపిరితిత్తులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఈ కాలంలో ఊపిరితిత్తులు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముందే జాగ్రత్త పడండి
సాధారణంగా 20 ఏళ్ల వయస్సు వచ్చే సరికి ఊపిరితిత్తుల సామర్థ్యం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. తర్వాత మన జీవనశైలి ఆధారంగా అది తగ్గవచ్చు. పెద్ద నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆస్తమా, COPD వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
రోజూ వ్యాయామం తప్పనిసరి
ఊపిరితిత్తులను బలంగా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. ఇలా చేస్తే ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం అలవాటు చేసుకుంటాయి. దీని వల్ల శ్వాసకోశ సామర్థ్యం పెరుగుతుంది. నెమ్మదిగా మొదలుపెట్టినా సరే, క్రమం తప్పకుండా చేయాలి.
నవ్వడం వల్ల ఊపిరితిత్తుల్లోని పాత గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి చేరుతుంది. ఇది శ్వాస వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
నీరు తాగండి
చలికాలంలో దాహం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి చాలామంది నీరు తాగడం తగ్గిస్తారు. కానీ, నీరు తక్కువగా తాగితే కఫం మందంగా మారి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి చలికాలమైనా సరే రోజుకు సరిపడా నీరు తాగాలి.
ఊపిరితిత్తులు బలంగా ఉన్నంత కాలం మీ జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాస నాణ్యతే జీవన నాణ్యత. కాబట్టి చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన ఆహారం, వ్యాయామంతో వాటిని కాపాడుకోండి.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News