మీ పిల్లలు రాత్రిపూట సరిగా నిద్రపోవడం లేదా? కారణాలు తెలుసుకోండి
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:45 PM
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మంచి నిద్ర చాలా అవసరం. అయితే ప్రస్తుతం చాలా మంది పిల్లలు రాత్రిపూట నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం చాలా మంది పిల్లలు వివిధ కారణాల వల్ల రాత్రిపూట సరిగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పిల్లలు త్వరగా నిద్రపోతే, మరికొందరు రాత్రంతా మేల్కొని ఉంటారు. పిల్లలు నిద్రపోకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు తెలుసుకోవడం అవసరం..
పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం..
చిన్న పిల్లలు మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే, రాత్రిపూట నిద్ర రావడం కష్టం అవుతుంది. కాబట్టి పగటిపూట నిద్ర సమయాన్ని పరిమితం చేయడం మంచిది. అలాగే రోజూ ఒకే సమయానికి పడుకునేలా చేయాలి.
అనారోగ్యం..
జలుబు, దగ్గు, అలెర్జీలు లేదా ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా నిద్రపోలేరు. అలాంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మొబైల్, టీవీ వంటి గాడ్జెట్‌ల వాడకం..
పడుకునే ముందు మొబైల్, టీవీ లేదా వీడియో గేమ్స్ ఉపయోగించడం వల్ల పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది. దీని వల్ల నిద్ర రావడం ఆలస్యం అవుతుంది.
గదిలో అసౌకర్యం..
గదిలో ఎక్కువ వెలుతురు, శబ్దం లేదా ఎక్కువ వేడి లేదా చలి ఉన్నప్పుడు పిల్లలకు నిద్ర సరిగా పట్టదు. గది ప్రశాంతంగా ఉండేలా చూడాలి.
భయం లేదా ఆందోళన..
చీకటి భయం, ఒంటరిగా నిద్రపోవడంపై భయం లేదా చెడు కలలు కూడా పిల్లల నిద్రను ప్రభావితం చేస్తాయి.
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి సరైన నిద్ర చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల నిద్ర అలవాట్లను గమనించి, సరైన వాతావరణం కల్పించాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News