Share News

వ్యాయామం తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:09 PM

చాలామంది వ్యాయామం చేయడంపై చూపించే శ్రద్ధ, అది పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చూపరు.

వ్యాయామం తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
Post Workout Tips

ఇంటర్నెట్ డెస్క్: చాలామంది వ్యాయామం చేయడంపై చూపించే శ్రద్ధ, అది పూర్తైన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చూపరు. నిజానికి మనం వ్యాయామం చేసేటప్పుడు కండరాలు ఒత్తిడికి లోనవుతాయి, శరీరంలోని శక్తి నిల్వలు ఖర్చవుతాయి. వ్యాయామం ముగిసిన తర్వాత శరీరాన్ని సరైన పద్ధతిలో సాధారణ స్థితికి తీసుకురాకపోతే అలసట, కండరాల నొప్పులు, గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫిట్‌నెస్ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడానికి వ్యాయామం తర్వాత పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.


కూల్ డౌన్:

వ్యాయామం ఆపిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకూడదు. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం లేదా తేలికపాటి స్ట్రెచెస్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది.

నీరు తాగడం:

వ్యాయామం చేసేటప్పుడు చెమట రూపంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించాలి. కాబట్టి తగినంత నీరు తాగాలి. అవసరమైతే కొబ్బరి నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయాలూ తీసుకోవచ్చు.

ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు:

వ్యాయామం చేసిన 30-60 నిమిషాలలోపు పోషకాహారం తీసుకోవడం మంచిది. కండరాల మరమ్మతు కోసం ప్రోటీన్(గుడ్లు, పప్పు ధాన్యాలు), శక్తి కోసం కార్బోహైడ్రేట్లు(ఓట్స్, పండ్లు) ఉన్న ఆహారం తీసుకోవాలి.

స్నానం:

వ్యాయామం తర్వాత వచ్చే చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం కొంచెం చల్లబడిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

విశ్రాంతి:

కండరాలు కోలుకోవడానికి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. రాత్రి కనీసం 7-8 గంటల గాఢనిద్ర ఉండేలా చూసుకోవాలి.

దుస్తులు మార్చుకోవడం:

చెమట పట్టిన దుస్తులను ఎక్కువసేపు ధరించకూడదు. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం అవ్వగానే పొడి దుస్తులు మార్చుకోవడం మంచిది.

ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాయామ ఫలితాలను మెరుగుపడటమే కాకుండా, దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 30 , 2026 | 01:32 PM