Nail Biting Habit: గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఆరోగ్యానికి పెద్ద దెబ్బ
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:44 PM
చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చిన్న అలవాటులా కనిపించే ఇది క్రమంగా ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు కొరకడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. మొదట ఇది చిన్న అలవాటులా అనిపించినా, కాలక్రమేణా ఇది ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, బోర్ కొట్టినప్పుడు చాలామంది గోళ్లు కొరకడం ప్రారంభిస్తారు. కానీ ఈ అలవాటు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోళ్లలో మురికి, బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని నోటిలో పెట్టుకోవడం వల్ల అవి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా నోరు, కడుపు, చర్మానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలు..
ఆరోగ్య నిపుణుల ప్రకారం, గోళ్లు కొరకడం వల్ల కడుపు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. గోళ్లలోని మురికి, బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నోట్లో పుండ్లు, రక్తస్రావం, దంతాల ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడవచ్చు. నిరంతరం ఇలా చేస్తే దంతాలు అరిగిపోవడం, వంకరగా మారడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
గోళ్లు కొరికే అలవాటును ఎలా మానుకోవాలి?
ఈ అలవాటును మానాలంటే ముందుగా దాని కారణాన్ని గుర్తించాలి. ఒత్తిడి, టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస తీసుకోవడం వంటి వ్యాయామాలు చేయాలి. గోళ్లను ఎప్పుడూ చిన్నగా కత్తిరించి ఉంచడం మంచిది. అవసరమైతే కౌన్సిలర్, వైద్యుడి సహాయం తీసుకోవచ్చు. చేతులు, నోటి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పిల్లలలో ఈ అలవాటు కనిపిస్తే మొదటి నుంచే శ్రద్ధ తీసుకుని సరిదిద్దాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News