Share News

టాబ్లెట్స్ కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

ABN , Publish Date - May 20 , 2026 | 01:54 PM

మార్కెట్లో నకిలీ మందుల విక్రయం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టాబ్లెట్స్ కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Tips to Identify Fake Medicines

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చిన్న తలనొప్పి నుంచి పెద్ద ఆరోగ్య సమస్యల వరకు చాలా మంది మందులపై ఆధారపడుతున్నారు. అయితే మార్కెట్లో నకిలీ మందుల విక్రయం పెరుగుతున్న నేపథ్యంలో మందులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన మందులకు బదులు నకిలీ మందులు వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే, మనం తీసుకునే మందులు అసలైనవో కావో గుర్తించే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం.


జాగ్రత్తగా పరిశీలించండి

మనం తీసుకునే మెడిసిన్ పేరు, స్పెల్లింగ్‌, బ్యాచ్ నంబర్‌, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను తప్పకుండా చూడాలి. పేరులో అక్షర దోషాలు ఉంటే అది నకిలీ మందు అయ్యే అవకాశం ఉంది.

కంపెనీ పేరు, లోగో చెక్ చేయండి

ప్రతి ఔషధ కంపెనీకి ప్రత్యేక లోగో ఉంటుంది. మెడిసిన్ ప్యాకెట్‌పై ఉన్న లోగోను అధికారిక కంపెనీ లోగోతో పోల్చి చూడాలి. పేరు లేదా లోగోలో చిన్న మార్పులు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి.

QR కోడ్‌ను స్కాన్ చేయండి

కొన్ని మందులపై ప్రభుత్వం QR కోడ్ తప్పనిసరి చేసింది. ఫోన్‌తో స్కాన్ చేస్తే మందుకు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. వివరాలు రాకపోతే జాగ్రత్త పడాలి.


డాక్టర్‌తో మరోసారి నిర్ధారించుకోండి

డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో కొనుగోలు చేసిన మందు సరైనదేనా అనే విషయాన్ని అవసరమైతే వైద్యులతో మరోసారి చెక్ చేయించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల నకిలీ మందులు వాడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

నాణ్యతను పరిశీలించండి

క్యాప్సూల్స్ జిగటగా ఉండటం, టాబ్లెట్లు పొడిగా మారడం, సిరప్ సీల్ తెరిచి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని వాడకూడదు.

ఎక్కడ పడితే అక్కడ మందులు కొనొద్దు

ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే మందులు కొనాలి. అలాగే బిల్లు తప్పకుండా తీసుకోవాలి.

గడువు తేదీ తప్పక చూడండి

మందులు కొనుగోలు చేసే ముందు వాటి గడువు తేదీని తప్పకుండా పరిశీలించాలి. త్వరలో ఎక్స్‌పైరీ అయ్యే లేదా గడువు ముగిసిన మందులను వాడకూడదు. అలాంటి మందులు ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఫర్నిచర్‌కు చెదలు పట్టిందా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

Updated Date - May 20 , 2026 | 02:07 PM