Benefits of Surya Namaskar: సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలా..
ABN , Publish Date - Jan 05 , 2026 | 07:58 AM
ఇంట్లో సూర్య నమస్కారం చేయడం వల్ల జిమ్‌కి వెళ్లడం కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా?. సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రోజుకు కేవలం 10 నిమిషాలు చేస్తే శరీరం చురుగ్గా ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఉదయం వ్యాయామం కోసం జిమ్‌కి వెళ్తుంటారు. అయితే, ఇంట్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల జిమ్‌కి వెళ్లడం కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా?. అంతేకాకుండా, సమయం కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన వ్యాయామంగా చెప్పవచ్చు. అయితే, ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడం
నిపుణుల ప్రకారం, సూర్య నమస్కారాలను వేగంగా చేస్తే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఇది కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయడం వల్ల అదనపు కొవ్వు తగ్గిపోతుంది. తద్వారా స్థూలకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
రక్త ప్రసరణ
ఈ ఆసనాలు శరీరమంతా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్తప్రసరణ, ఆక్సిజన్ ను పుష్కలంగా అందిస్తుంది, దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖం మెరుస్తుంది.
రోగనిరోధక శక్తి
సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సాధారణ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది.
మానసిక ప్రశాంతత
శ్వాస నియంత్రణ సూర్య నమస్కారంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని.. ఏకాగ్రత, దృష్టి మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఊపిరితిత్తుల పనితీరు మెరుగై శ్వాసకోశ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు
సంప్రదాయకంగా సూర్యుడిని శక్తి, ఆరోగ్యానికి మూలంగా భావిస్తారు. సూర్య నమస్కారం అనేది సూర్యుడికి కృతజ్ఞత తెలుపుతూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడానికి చేసే భక్తి యోగం. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
కీరదోసకాయ వీరు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News