వేసవిలో మర్చిపోయి కూడా తినకూడని ఆహార పదార్థాలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:01 PM
వేసవి కాలంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు శరీరంలోని వేడిని పెంచి, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలు, నీరసానికి దారితీస్తాయి. వేసవిలో ఈ ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం మొదలైంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు శరీరంలోని వేడిని పెంచి, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలు, నీరసానికి దారితీస్తాయి. అందుకే వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యులు చెబుతుంటారు. వేసవిలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
1. మసాలాలు, కారం:
మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం రుచిగా ఉన్నప్పటికీ, వేసవిలో ఇవి శరీరానికి అంత మంచిది కాదు. కారం, గరం మసాలా వంటివి శరీరంలోని ‘థర్మోజెనిస్’ (వేడి పుట్టించడం) ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీనివల్ల అతిగా చెమట పట్టడం, కడుపులో మంట, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
2. పాల ఉత్పత్తులు:
చాలా మంది మిల్క్ షేక్ తాగడానికి ఇష్టపడుతుంటారు. పాలతో చేసే ఇతర జ్యూస్ తాగుతుంటారు. పాలు, వెన్నె లేదా జున్ను వంటి పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.
3. కూల్ డ్రింక్స్, సోడాలు:
వేసవి కాలంలో చల్లగా ఉంటాయని చాలా మంది కూల్ డ్రింక్స్, సోడాలు, ఇతర జ్యూస్ ఎక్కువగా తాగుతుంటారు. సాఫ్ట్ డ్రింక్స్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచి, తర్వాత నీరసానికి గురిచేస్తుంది. ఇలాంటి డ్రింక్స్ తాత్కాలికంగా దాహం తీర్చినట్లు అనిపించినా, శరీరంలోని నీటి నిల్వలను తగ్గిస్తాయి.
4. వేయించిన జంక్ ఫుడ్:
నూనెలో వేయించిన సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీ, బజ్జీలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు, వేసవిలో నూనె పదార్ధాలు అతిగా తింటే వేడి ఎక్కువ అయి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
5. సుగంధ ద్రవ్యాలు:
ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ, వేసవి కాలంలో ఇవి శరీరానికి అంత మంచిది కాదు.. అధిక వేడిని కలిగిస్తాయి.